• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వాటర్‌ వర్క్స్‌ ముట్టడి: తెరాస నేతల అరెస్టు

By Staff
|

హైదరాబాద్‌: తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, కార్యకర్తలు మంగళవారంనాడు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో గల మెట్రోవాటర్‌ వర్క్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖైరతాబాద్‌ వద్ద వారు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయ కలిగింది. దీంతో పోలీసులు తెరాస శాసనసభ్యులను, కార్యకర్తలను అరెస్టు చేశారు.

హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ పని చేస్తున్న స్థానికేతరులను వెంటనే వెనక్కి పంపించాలని తెరాస ఆందోళకారులు డిమాండ్‌ చేశారు. గిర్‌గ్లానీ కమీషన్‌ నివేదికను యధాతథంగా అమలు చేయాలని కూడా వారు డిమాండ్‌ చేశారు. 610 జీవోను అమలు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదని తెరాస నాయకులు విమర్శిస్తున్నారు. 610 జీవోను అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేయడం లేదని, దీన్ని బట్టి ఈ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తోందని అర్థమవుతోందని తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X