• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరీంనగర్‌ తెరాస అభ్యర్థి చంద్రశేఖర రావే

By Staff
|

హైదరాబాద్‌: కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బుధవారంనాడు ఖరారు చేసింది. క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు విసిరిన సవాల్‌ నేపథ్యంలో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి చంద్రశేఖర రావు రాజీనామా చేశారు. దీంతో కరీంనగర్‌కు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. తిరిగి చంద్రశేఖరరావునే ఆ స్థానం నుంచి పోటీకి నిలపాలని తెరాస నిర్ణయం తీసుకుంది. బుధవారం నాడు జరిగిన పార్టీ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కరీంనగర్‌ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ రాష్ట్ర సాధన ఆధారపడి వుంటుందని బలంగా ప్రజల్లోకి తీసికెళ్లాలని పార్టీ నిర్ణయించింది. కరీంనగర్‌ ఉప ఎన్నికలో పార్టీ గెలుపునకు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే విషయంపై కూడా ఆలోచన చేస్తున్నారు. కెసిఆర్‌ అభ్యర్థిత్వాన్ని శాసనసభ్యుడు ఈటెల రాజేందర్‌ ప్రతిపాదించగా లోక్‌సభ సభ్యుడు ఎ. నరేంద్ర బలపరిచారు. కరీంనగర్‌ ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో పాటు కరీంనగర్‌ జిల్లా, మండలస్థాయి నాయకులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X