వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంచల్‌గుడా జైలులో మోనికా బేడి దినచర్య

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చంచల్‌గుడా జైలులో సినీ నటి, అండర్‌ వరల్డ్‌ డాన్‌ అబూ సలేం ప్రియురాలు మోనికా బేడీ ఎక్కువ సమయాన్ని గ్రంథాలయంలోనే వెచ్చిస్తున్నట్లు సమాచారం. నకిలీ పాస్‌పోర్టుల కేసులో ఆమెకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. తెల్లని దుస్తులు ధరించిన మోనికా క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వెళ్తున్నారని తెలుస్తోంది. ప్రతి రోజూ ఉదయం అల్పాహార భోజనం చేసిన వెంటనే తన సహచరులతో కలిసి ఆమె గ్రంథాలయానికి వెళ్లి చదువులో మునిగిపోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ఎక్కువగా చరిత్ర, సైన్స్‌ పుస్తకాలను తిరగేస్తున్నట్లు, వార్తా పత్రికలు చదువుతున్నట్లు చెబుతున్నారు.

జైలు నిబంధనల ప్రకారం ప్రతి ఖైదీ ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లేదా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు టూత్‌ పౌడర్‌, క్యాండిల్స్‌, కుట్టుపని నేర్చుకునేందుకు వర్క్‌షాప్‌కు హాజరు కావాల్సి వుంటుంది. మోనికా బేడి మధ్యాహ్నం పూట వర్క్‌షాప్‌కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. సహ ఖైదీలతో ఆమె కలిసి పోతున్నారని, సినిమాల్లో తన అనుభవాలను వారికి వివరిస్తున్నారని అంటున్నారు. ఖైదీలకు ఆమె పాఠాలు కూడా చెబుతున్నారు. జైలు నిబంధనల ప్రకారం చదువుకున్న ఖైదీలు ఇతర ఖైదీలకు పాఠాలు చెప్పాల్సి వుంటుంది. బారాక్‌లోని తర 20 మందితో కలసి ఆమె సాయంత్రం వేళ టెలివిజన్‌ చూస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X