వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే పోటీకి రా!: ఎమ్మెసార్‌కు నరేంద్ర సవాల్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దమ్ముంటే కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో తమ నేత కె. చంద్రశేఖరరావుపై పోటీకి దిగాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత ఎ. నరేంద్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణకు సవాల్‌ విసిరారు. తమ నేత ఓడిపోతే తాము రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా వున్నామని ఆయన అన్నారు. ఎమ్మెస్సార్‌ సవాల్‌ను తాము స్వీకరించడానికి సిద్ధంగా వున్నట్లు ఆయన తెలిపారు. పార్టీ పల్లెబాట కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు.

సత్యనారాయణరావు తెల్లంగాణ తల్లిని మరిచిపోయారని ఆయన విస్మరించారు. సత్యనారాయణలో తెలంగాణ రక్తం ఏదని ఆయన అడిగారు. చీమూనెత్తురు, సిగ్గుశరం ఉంటే సత్యనారాయణరావు మంత్రి పదవికి రాజీనామా చేసి కరీంనగర్‌ ఉప ఎన్నికలో చంద్రశేఖరరావుపై పోటీ చేయాలని ఆయన సవాల్‌ చేశారు. సత్యనారాయణరావు ఎక్కువగా మాట్లాడటం సరి కాదని, నోరు మూసుకుంటే మంచిదని ఆయన అన్నారు. కరీంనగర్‌ ప్రజలే సత్యనారాయణరావుకు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X