• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెరాసకు కెసిఆర్‌ అల్లుడు ఉమేష్‌ గుడ్‌బై

By Staff
|

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆ పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు అల్లుడు, పార్టీ మాజీ కార్యదర్శి ఉమేశ్‌రావు రాజీనామా చేశారు. ఎవరినీ సంప్రదించకుండా కరీంనగర్‌ లోక్‌సభ సభ్యత్వానికి చంద్రశేఖరరావు రాజీనామా చేసినందుకు నిరసనగా తాను రాజీనామా చేసినట్లు ఉమేశ్‌ రావు శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

తెరాసకు ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే బలం ఉందని, ఇటీవలి జిల్లా పరిషత్‌ ప్రాదేశిక కమిటీ (జడ్‌పిటిసి)ల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. తెరాస ఒకటి రెండు స్థానాల్లో తప్ప ఎక్కడా గెలవలేకపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ పట్ల ఒకటి రెండు జిల్లాల్లో తప్ప ప్రజల్లో సానుకూలత లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X