వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విద్య, వైద్య రంగాల్లో వైఎస్ సర్కారు విఫలం: యనమల
తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో ఘోరంగా విఫలమయిందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. శనివారం ఆయన శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. అనంతరం విలే కరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయిందన్నారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న గన్యా వ్యాధి నివారణకు సర్కారు సరియైన చర్యలు చేపట్టలే దని విమర్శించారు.
బిసి విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరు చేయడంలేదన్నారు. ప్రభుత్వం విద్యార్థుల పరీక్ష ఫీజులు పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇక ఔటర్ రింగ్‌రోడ్డులో అక్రమాలకు అంతేలేదని యనమల అన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే ప్రతిపక్షాలు, పత్రికలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలో ఈ ప్రభుత్వం ఘనత వహించిందని ఆయన విమర్శించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!