వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌, బిజెపిలతోనే తెలంగాణ సాధ్యం: సిహెచ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాంగ్రెస్‌, బిజెపి వల్లనే సాధ్యమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్‌ నాయకుడు సిహెచ్‌. విద్యాసాగర రావు అన్నారు. క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణరావు వల్లనే కరీంనగర్‌ లోక్‌సభకు ఉప ఎన్నిక జరుగుతోందనే వాదనలో నిజం లేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యక్తిగతంగా లాభం పొందడానికే రాజీనామా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ గురించి తెలిసినా రాజకీయ నాయకులు తెలియనట్లు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తెలంగాణ గురించి తెలిసినా తెలియనట్లు నటించే రాజకీయ పార్టీలు తమ వైఖరి మార్చుకోవాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X