• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రత్యేక తెలంగాణపై లోక్‌సత్తా తటస్థం: జెపి

By Staff
|

కరీంనగర్‌: ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకం కాదు, అఅనుకూలమూ కాదని లోక్‌సత్తా నాయకుడు జయప్రకాష్‌ నారాయణ చెప్పారు. వచ్చే కరీంనగర్‌, బొబ్బిలి ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని, ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వబోమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పత్రికలపై దాడులు నాజీల దురహంకారాన్ని తలపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

పత్రికలపై దాడులు చేయడం, పత్రికా ప్రతులు తగులబెట్టడం నాగరికం కాదని ఆయన అన్నారు. పత్రికలపై దాడులు, ప్రతుల దగ్ధం వంటి చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. పత్రికల్లో తనపై వచ్చిన విమర్శలను భారత ప్రథమ ప్రథాని జవహర్‌లాల్‌ నెహ్రూ హుందాగా స్వీకరించేవారని ఆయన గుర్తు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X