• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేవుడు దయతలిస్తే రాజకీయాల్లోకి: వైయస్‌ జగన్‌

By Staff
|

కడప: దేవుడు దయ తలిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ పుత్రుడు వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. కడప జిల్లా పులివెందులలో ఆయన పాలిమర్‌ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ తమిళ నటుడు సూర్య కూడా పాల్గొన్నారు. బురద చల్లడానికే తనను భూవివాదాల్లోకి లాగుతున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌ పరిసరాల్లో తనకు ఏ విధమైన భూములు లేవని, తన ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు నిరూపించినా దాన్ని ఇచ్చేస్తానని ఆయన అన్నారు. ఎవరైన తన పేరును వాడుకుని ప్రయోజనం పొందాలని చూస్తే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డిపై కక్ష తీర్చుకోవడానికి తన పేరును పావుగా వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఇంతకు ముందయితే బాధపడేవాడినని, ఇప్పుడు నవ్వుకుంటున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడమనేది కాలమే నిర్ణయిస్తుందని, తాను రాజకీయాల్లోకి రాకున్నా ఫరవా లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X