• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్‌ను బర్తరఫ్‌ చేయండి: టిడిపి వినతి

By Staff
|

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు గౌరు చరితా రెడ్డి భర్త గౌరు వెంకటరెడ్డికి క్షమాభిక్షను ప్రసాదించడంలో రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్‌ నాగం జనార్దన్‌ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ను కోరారు. కప్పం ఆగిపోతుందనే భయంతోనే కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం నాయకులు వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టిన కేసులో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిది తప్పులేదని కితాబిస్తున్నారని, కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ మాటలు ఇందుకు ఉదాహరణ అని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

వెంకటరెడ్డికి క్షమాభిక్ష ప్రసాదించడంలో ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నోరు విప్పకపోవడం దారుణమని ఆయన అన్నారు. వెంకటరెడ్డికి క్షమాభిక్ష పెట్టడానికి ఒకే కారణం ఉందని, కాంగ్రెస్‌కు మంచి కార్యకర్త కావడమే ఆ ఏకైక కారణమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X