• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌ నుంచి నకిలీ వీసా దరఖాస్తులు: పీటర్‌

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి నకిలీ వీసా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ పీటర్‌ కాస్నర్‌ అన్నారు. వీసా సౌకర్యం ఉగ్రవాదులకు అందకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు. వీసాల మంజూరీలో ప్రధాన సమస్య నకిలీ దరఖాస్తులు రావడమేనని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో కాన్సులేట్‌ ఏర్పాటు వసతులను పరిశీలించడానికి పదిహేను మంది బృందంతో వచ్చిన పీటర్‌ బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 2008 నాటికి హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

పైగా ప్లాజాలో తాత్కాలిక కాన్సులేట్‌ కార్యాలయం ఏర్పాటుపై పరిశీలన జరిపినట్లు ఆయన తెలిపారు. కాన్సులేట్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ అనుకూలమైన నగరమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ కార్యాలయంలో లక్షా 50 వేల వీసా దరఖాస్తులు ప్రాసెస్‌ చేస్తారని ఆయన చెప్పారు. వీసాల కోసం వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరించామని ఆయన చెప్పారు. దేశంలో మొత్తం అమెరికాకు 4 లక్షల వీసాలు మంజూరు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్‌కు చెందినవే 20 శాతం వున్నాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X