వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంతన్‌కుమార్‌ హత్యకు ప్రయత్నించా: కాట్రగడ్డ బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వంగవీటి శంతన్‌కుమార్‌పై హత్యా యత్నం నిజమేనని, అందుకు బాధ్యుడిని తానేనని తెలుగుదేశం నాయకుడు కాట్రగడ్డ బాబు పోలీసు ఇంటరాగేషన్‌లో అంగీకరించారు. కాంగ్రెస్‌ నాయకుడు శంతన్‌కుమార్‌ను హత్య చేయమని తాను 4 లక్షల రూపాయల నగదును, ఒక తుపాకిని అందజేసినట్టు కాట్రగడ్డ బాబు చెప్పారు. కత్తులతో శంతన్‌ను హత్య చేయాలని పథకం వేసుకున్నామని, అది సాధ్యం కాకపోవడంతో తుపాకితో కాల్పులు జరపవలసివచ్చిందని ఆయన వెల్లడించారు.

వంగవీటి శంతన్‌కుమార్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత కాట్రగడ్డ బాబు అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళిపోయి ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. కొన్ని దశాబ్దాలుగు విజయవాడలో సాగుతున్న కుల రాజకీయాలకు, వాటి మధ్య ఘర్షణలకు కాట్రగడ్డ, వంగవీటి ఉదంతం తాజా ఉదాహరణ. విజయవాడలో కమ్మ, కాపు వర్గ నాయకుల మధ్య ఎంతో కాలంగా కక్షలు రగులుతున్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X