• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేపు రాష్ట్ర పర్యటనకు మన్మోహన్‌ సింగ్‌

By Staff
|

హైదరాబాద్‌: ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఒక రోజు పర్యటన నిమిత్తం గురువారం (రేపు) హైదరాబాద్‌ వస్తున్నారు. ఆయన ఉదయం పది గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. అనంతరం ఆయన సర్దార్‌ వల్లభబాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీలో జరిగే ఐపియస్‌ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం పది గంటల 20 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనకు హెలిపాడ్‌లో బయలుదేరి వెళ్తారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట వద్ద ఆయన ఏడో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మన్మోహన్‌ సింగ్‌ హెలిపాడ్‌ దిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X