• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజయ్య బాధితులకు విపక్షాల అండదండలు

By Staff
|

హైదరాబాద్‌: రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ నాయకుడు ఆకుల రాజయ్య భూకొనుగోలు వ్యవహారంలో బాధితులకు అండగా నిలుస్తామని విపక్షాల నాయకులు హామీ ఇచ్చారు. తెలుగుదేశం, సిపిఐ, సిపియం, బిజెపి నాయకులు గురువారంనాడు నల్లగొండ జిల్లాలోని సంస్థాన్‌ నారాయణపురం, తదితర ప్రాంతాల్లో ఆకుల రాజయ్య ఆక్రమించుకున్న భూముల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

ఆకుల రాజయ్య భూకొనుగోళ్ల వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎవరి భూములు వారు స్వాధీనం చేసుకోవాలని, తాము అండగా నిలుస్తామని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ బాధితులతో చెప్పారు. ఆకుల రాజయ్య వ్యవహారంపై ప్రభుత్వం తగిన చర్యలకు ఉపక్రమించింది. రాజయ్య కుమారుడు శ్రీనివాస్‌ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆచూకీ కోసం ఇంటర్‌పోల్‌ సహకారం కూడా తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఆకుల రాజయ్య వివిధ అక్రమ పద్ధతుల్లో 14 వేల ఎకరాలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X