• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జోద్‌పూర్‌ మాజీ మహారాజుకు అవార్డు

By Staff
|

న్యూయార్క్‌: చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకు, ప్రాచీన కట్టడాలు కాలగర్భంలో కలిసిపోకుండా కషిచేసినందుకు ప్రతిష్టాత్మక 2006 హద్రియన్‌ అవార్డు జోధ్‌పూర్‌ మాజీ మహారాజా గజ్‌సింగ్‌ 2 ను వరించింది. ప్రాచీన కట్టడాల పరిరక్షణే తన జీవితలక్ష్యంగా చేసుకుని కషిచేస్తున్న సింగ్‌ను ఓ ఉత్సవంలో ఘనంగా సత్కరించారు. భారత రాయబారి రోనెన్‌ సేన్‌ గజ్‌సింగ్‌కు అవార్డును, ఓ ట్రోఫీని జ్ఞాపికను అందజేశారు. ప్రతిఫలం ఆశించని వరల్డ్‌ మాన్యుమెంట్స్‌ ఫండ్‌ అనే సంస్థ ఈ అవార్డును గజ్‌సింగ్‌కు ఇచ్చింది. భారతీయ ప్రాభవం, ప్రాచీనశిల్పకళ, భవన నిర్మాణ శైలులకు అద్దంపట్టే చారిత్రాత్మక కట్టడాలను పరిరక్షించడం బహత్‌ కార్యమే. భవిష్యత్‌ తరాలకు భారతీయ చరిత్ర, తమ జాతి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు గజ్‌సింగ్‌ తెలిపారు. భారతీయ సాంస్కతిక, చారిత్రాత్మక సంపదను నేత్రపర్వంగా తిలకించవలసిందిగా గజ్‌సింగ్‌ టూరిస్ట్‌లను, ప్రవాస భారతీయులను కోరారు. మహారాజా తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆనాటి భవనాలు తనకు ఆశ్చర్యం కల్గించేవని, ప్రాచీన కట్టడాలు శిధిలంకావడం తనను బాధించిందని అందుకే గట్టి కషి చేసితమ సొంత కోటలు, అంచే జోధ్‌పూర్‌లో 15వ శతాబ్దిలో నిర్మించిన మేహరాంఘర్‌, నాగవుర్‌లో 12వ శతాబ్దిలో నిర్మించిన అహిఛాత్రఘర్‌ పునరుద్ధరణకు కషి చేశానని తెలిపారు. మెహరాంఘర్‌ మ్యూజియం ట్రస్ట్‌ ఈ భవనాల నిర్వహణను చూస్తోంది. హెరిటేజ్‌ హోటళ్ళ ఏర్పాటును ఆయన ఉద్యమంగా సాగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X