వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహిళా రిజర్వేషన్లకు మగ ఎంపీలే అడ్డు: సోనియా
ముంబయ్: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మగ ఎంపీలే అడ్డుగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఇక్కడ విమర్శించారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లుపై ఏకాభిప్రాయ సాధనకు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఆమె చెప్పారు. ముంబయ్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె స్దానిక సంస్ధల్లో మహిళలకు రిజర్వేషన్లు రావడానికి కారణం రాజీవ్ గాంధీయేనని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Story first published: Sunday, October 29, 2006, 23:53 [IST]