వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయ సైనికులకు ఐరాస ప్రశంస

By Staff
|
Google Oneindia TeluguNews

జెరూసలెం: దక్షిణ లెబనాన్‌లో యుద్ధసమయంలో భారతీయ సైనికులు చేసిన విశిష్ట సేవలకుగుర్తింపుగా లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతిసేనలోభాగంగా ఉన్న భారతీయ సైనికులకు యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌ కమాండర్స్‌ యూనిట్‌ ప్రశంసా పత్రాలతో సత్కరించారు. భారతీయ బెటాలియన్‌లోని 73 మంది అధికారులు, సైనికులు ఈ సన్మానం అందుకున్నారు. ఇటీవల భారతీయ సైనికులను ఫోర్స్‌ కమాండర్స్‌ కమాండేషన్‌ కార్డ్‌తో సత్కరించారు. భారతీయ బెటాలియన నాల్గో సిక్‌ రెజిమెంట్‌ మెడల్‌ డే పరేడ్‌లో పాల్గొంది. ఫోర్స్‌ కమాండర్‌ నుంచి యుఎన్‌ మెడల్స్‌ సాధించిన కల్నల్‌ సుభాష్‌ పన్వర్‌ ఆధ్వర్యంలోని బెటాలియన్‌ లెబనాన్‌- ఇజ్రాయిల్‌ సరిహద్దుల్లో పలుకీలక పోస్ట్‌లను పర్యవేక్షిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X