• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మేయర్‌ ఎన్నిక వాయిదా విభేదాల వల్ల కాదు: కెకె

By Staff
|

హైదరాబాద్‌: విజయవాడ నగర పాలక సంస్థ మేయర్‌ ఎన్నిక తమ పార్టీలోని విభేదాల వల్ల వాయిదా పడలేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు స్పష్టం చేశారు. వరద తాకిడి సహాయ కార్యక్రమాల్లో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర తీరిక లేకుండా ఉండడం వల్ల వాయిదా పడిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. మల్లికా బేగం, రత్నప్రభ చెరి రెండేళ్లు మేయర్‌ పదవిలో వుంటారని, ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన చెప్పారు. మొదట మేయర్‌ పదవి ఎవరు చేపట్టాలనే విషయంపై కూడా నిర్ణయం జరిగిందని, అయితే ఈ విషయాన్ని గోప్యంగా వుంచుతున్నామని ఆయన చెప్పారు.

పార్లమెంటు సభ్యుడు మల్లికా బేగమ్‌కు మొదట మేయర్‌ పదవికి కట్టబెట్టాలని నిర్ణయించడంతో శాసనసభ్యులు దేవినేని నెహ్రూ, వంగవీటి రాధాకృష్ణ అలిగినట్లు తెలుస్తోంది. రత్నప్రభను రాధాకృష్ణ బలపరుస్తున్నారు. మేయర్‌ అభ్యర్థిపై వివాదం చెలరేగడంతో నెహ్రూను, రాధాకృష్ణను హైదరాబాద్‌ రావాల్సిందిగా కేశవరావు కోరారు. అయితే నెహ్రూ రాలేదు. రాధాకృష్ణ మాత్రం వచ్చి తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రత్నప్రభకు పదవిని కట్టబెట్టకపోతే తాను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పినట్లు సమాచారం. కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని ఖరారు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ్యుడు కొమిరెడ్డి రాములు బహిరంగ ప్రకటన చేయడం దురదృష్టకరమని కేశవరావు అన్నారు. ఈ విషయమై తనతో లేదా ముఖ్యమంత్రితో రాములు మాట్లాడి వుంటే బాగుండేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X