• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పంతం నెగ్గించుకున్న లగడపాటి: బేగమే మేయర్‌

By Staff
|

విజయవాడ: విజయవాడ నగర పాలక సంస్థ మేయర్‌ పదవి విషయంలో పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ తన పంతం నెగ్గించుకున్నారు. విజయవాడ నగర మేయర్‌గా రాజగోపాల్‌ బలపరిచిన మల్లికా బేగం బుధవారంనాడు ఎన్నికయ్యారు. మేయర్‌ ఎన్నికకు కాంగ్రెస్‌కు చెందిన 29 మంది కార్పోరేటర్లలో 23 మంది హాజరయ్యారు. శాసనసభ్యుడు రాధాకృష్ణతో పాటు ఆయన మద్దతుదారులైన కాంగ్రెస్‌ కార్పోరేటర్లు మేయర్‌ ఎన్నికకు గైర్హాజరయ్యారు.

కౌన్సిల్‌ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయవాడ మేయర్‌గా మల్లికా బేగం ఎన్నికయ్యారు. ఆమె అభ్యర్థిత్వాన్ని మాజీ మేయర్‌, సిపిఐ కార్పోరేటర్‌ తాడి శకుంతల బలపరిచారు. మరో కాంగ్రెస్‌ శాసనసభ్యుడు దేవినేని నెహ్రూ మేయర్‌ ఎన్నికకు హాజరయ్యారు. మేయర్‌ పదవికి శాసనసభ్యుడు రాధాకృష్ణ రత్నప్రభను బలపరిచారు. అయితే మల్లికాబేగం, రత్నప్రభ చెరి రెండేళ్లు మేయర్‌ పదవిని చేపడతారని పిసిసి ప్రకటించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X