• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విద్రోహ దినం సరి కాదు: ఎమ్మెస్సార్‌, నోముల

By Staff
|

కరీంనగర్‌/ హైదరాబాద్‌: తెలుగుతల్లిని వ్యతిరేకించడం, తెలుగుతల్లికి వ్యతిరేకంగా మాట్లాడటం సరి కాదని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని విద్రోహంగా దినంగా పాటించడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి మంచిది కాదని ఆయన బుధవారం కరీంనగర్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాటం చేయడం తప్పు కాదని, అయితే రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని విద్రోహం దినంగా పరిగణించడం సరి కాదని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య బుధవారంనాడు హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని విద్రోహ దినంగా పాటించడం ఆడలేక మద్దెల ఓడడమేనని ఆయన అన్నారు. తెలంగాణ వెనకబాటుతనానికి ఐదు దశాబ్దాల నిర్లక్ష్యమే కారణమని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు వెనకబడి వున్నాయని, వాటన్నింటి అభివృద్ధికి పాటు పడాల్సి వుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X