వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాఫ్రికా నుంచి గెలుపుతో వస్తాం: సచిన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: దక్షిణాఫ్రికా నుంచి తమ జట్టు విజయంతో తిరిగి వస్తుందని భారత క్రికెట్‌ క్రీడాకారుడు సచిన్‌ టెండూల్కర్‌ హామీ ఇచ్చారు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో సరిగా ఆడనందుకు అసంతృప్తి చెందామని, అయితే దక్షిణాఫ్రికా నుంచి విజయంతో తిరిగి వస్తామని ఆయన అన్నారు. జట్టుగా సానుకూల దృష్టితో తాము దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నామని ఆయన అన్నారు. కానన్‌ ఉత్పత్తులకు గ్లోబల్‌ అంబాసిడర్‌గా సంతకం చేసిన అనంతరం సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

న్యూజిలాండ్‌లో 2002లో విఫలమైనప్పటికీ 2003 ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శించిన ఆటతీరును ఆయన గుర్తు చేశారు. ప్రపంచకప్‌లో తాము ఫైనల్‌కు చేరుకున్నామని, ఆస్ట్రేలియాను తప్ప అన్ని జట్లను ఓడించామని ఆయన అన్నారు. వెస్టిండీస్‌పై మరో పది పరుగులు చేసి వుంటే తాము గెలిచి వుండేవారమని ఆయన అన్నారు. భారత్‌ ఫైనల్‌ ఓవర్‌లో ఓడిపోయిందని ఆయన చెప్పారు. ఛాంపియన్స్‌ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుచుకోవడాన్ని ప్రస్తావిస్తూ నిస్సందేహంగా ఆస్ట్రేలియా ప్రపంచంలో ఉత్తమ జట్టు అని కొనియాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X