• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైయస్‌ కనీస ధర్మం పాటించడం లేదు: బాబు

By Staff
|
హైదరాబాద్‌: వరద బాధితులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస ధర్మం పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నష్టం అంచనాలు రూపొందించడంలో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి వరద సహాయ చర్యలు చేపట్టే విషయంలో మార్గనిర్దేశం చేయలేపోయారని ఆయన అన్నారు.

ప్రభుత్వంలోని పెద్దల ప్రవర్తన వల్ల ప్రజలు బాధపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రజల జీవించే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తాము వాస్తవాలు చెబుతుంటే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లి వస్తున్నారనే తప్ప ముఖ్యమంత్రి వరద సహాయాన్ని రాబట్టలేకపోతున్నారని ఆయన అన్నారు. వరద తాకిడి ప్రాంతాల్లో వరిపంట నష్టమే 750 కోట్ల రూపాయలకు పైగా వుంటుందని ఆయన చెప్పారు. కావాలనో, లేదా వైఫల్యం వల్లనో నష్టాన్ని తక్కువ చేసి చూపుతున్నారని ఆయన అన్నారు. వరద తాకిడి తీవ్రతను తగ్గించి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X