• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండు స్థానాలూ గెలుస్తాం: దిగ్విజయ్‌

By Staff
|
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్‌, బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండూ గెలుస్తామని కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి బుధవారం దిగ్విజయ్‌ సింగ్‌తో సమావేశమై ఉప ఎన్నికల గురించి మాట్లాడారు. ఉప ఎన్నికలపై తాను రాజశేఖరరెడ్డితో మాట్లాడినట్లు దిగ్విజయ్‌ సింగ్‌ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్‌ కె. కేశవరావు పార్టీ స్థానిక నాయకులతో మాట్లాడుతారని, ఈ విషయాలను తాను తమ పార్టీ అధినేత సోనియా గాంధీకి వివరిస్తానని ఆయన చెప్పారు.

కరీంనగర్‌, బొబ్బిలి లోక్‌సభ ఎన్నికల్లో తాము ఘనవిజయం సాధిస్తామని రాజశేఖర రెడ్డి కూడా మీడియా ప్రతినిధులతో అన్నారు. గత రెండున్నరేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికుంటాయని, అవన్నీ బయటకు చెప్పడానికి వీలు కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X