• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రత్యక్ష ఆందోళనకు వామపక్షాలు సంసిద్ధం

By Staff
|
హైదరాబాద్‌: ప్రత్యేక ఆర్థిక మండళ్లపై ప్రత్యక్ష ఆందోళనకు రాష్ట్రంలోని తొమ్మిది వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఆందోళనాకార్యక్రమాలను ఖరారు చేయడానికి ఈ నెల 16వ తేదీన వామపక్షాల సమావేశం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. ఆర్థిక మండళ్లకు భూముల కేటాయింపు తీరును వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైతుల భూములను ఆర్థిక మండళ్ల పేర స్వాధీనం చేసుకుంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వామపక్షాల నాయకులు విమర్శిస్తున్నారు.

వరద తాకిడి ప్రాంతాల్లో సహాయ చర్యలు అమలైన తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ శాఖలన్నీ నిర్లక్ష్యం ప్రదర్శించాయని ఆయన విమర్శించారు. జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ముప్పై నలబై ఏళ్లు పడుతుందని ఆయన అన్నారు. డ్రెయిన్ల మరమ్మతులకు ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయకపోవడం వల్ల నష్టం తీవ్రంగా వుందని ఆయన అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం అనుసరించే నిబంధనలు ఆచరణ సాధ్యం కావని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X