• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మందాడి ఆత్మహత్య చేసుకున్నారని పుకార్లు

By Staff
|
వరంగల్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని పెద్ద యెత్తున పుకార్లు వ్యాపించాయి. మందాడి సత్యనారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఫోన్లు రావడంతో మీడియా ప్రతినిధులు ఉరుకులు పరుగుల మీద ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇదంతా తెరాస అధినేత కె. చంద్రశేఖరరావు, ఆయన అనుచరుల పనే అని మందాడి సత్యనారాయణ రెడ్డి విమర్శించారు. గత ఆరు మాసాలుగా తనను మానసికంగా హింసిస్తున్నారని ఆయన అన్నారు.

తనకు ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఆయన చెప్పారు. తన భార్యను, తల్లిని, పిల్లలను అసభ్యంగా తిడుతూ లేఖ కూడా రాశారని, ఈ లేఖను కెసిఆర్‌ వ్యక్తిగత కార్యదర్శికి ఇచ్చి ఇదేం పనయ్యా అని అడిగానని ఆయన చెప్పారు. తాను వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక తనను హింసించే పనికి చంద్రశేఖరరావుకు పూనుకున్నారని ఆయన విమర్శించారు. దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలిగానీ ఈ రకంగా హింసించడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణకు ఆంధ్రావాళ్ల నుంచి కన్నా కెసిఆర్‌ నుంచే ఎక్కువ మోసం జరుగుతుందని ఆయన అన్నారు. తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఎవరు ఫోన్లు చేశారో మీడియా ప్రతినిధులు చెప్పాలని ఆయన కోరారు. వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X