వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్యాస్ సరఫరాలో ఆంధ్రాకే ప్రాధాన్యం: ముఖేష్
హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ (కెసి బేసిన్) నిక్షేపాలకు చెందిన గ్యాస్ సరఫరా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కే ప్రాధాన్యం ఇస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చెప్పారు. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు తీరిన తర్వాతనే కెజి బేసిన్ గ్యాస్‌ను ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోన ప్రధాన నగరాలకే కాకుండా చిన్న చిన్న పట్టణాలకు కూడా గ్యాస్ అందేలా చూస్తామని ఆయన చెప్పారు. అపారమైన గ్యాస్ నిక్షేపాలున్నాయని, అయితే వాటిని వెలికి తీసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం లేదని ఆయన అన్నారు. కెజి బేసిన్లో గ్యాస్‌ను వెలికితీసే ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆయన చెప్పారు.