వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పవార్‌కు క్షమాపణ చెప్తా: రికీ పాంటింగ్
సిడ్నీ: తమ ప్రవర్తనకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్‌కు క్షమాపణ చెప్పడానికి తాము సిద్ధమేనని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమంలో బిసిసిఐ అత్యున్నత అధికారిని అవమానించాలనేది తమ ఉద్దేశం కాదని ఆయన వివరణ ఇచ్చారు. శరద్‌పవార్ పట్ల తమ జట్టు ప్రవర్తించిన తీరుపై ఆసీస్ క్రికెట్ బోర్డు విచారణ జరిపించడానికి ముందుకు రావడంతో పాంటింగ్ దిగి వచ్చారు.
తమ విజయాన్ని చాటుకునే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమంలో డామెన్ మార్టీన్ శరద్‌పవార్‌ను వేదిక దిగిపోవాలని వీపు మీద చేయి వేసి తోశాడు. దీన్ని భారత మీడియా తీవ్రంగా తప్పు పట్టింది. భారత క్రికెట్ క్రీడాకారులు చాలా మంది ఆసీస్ జట్టు ప్రవర్తనకు నొచ్చుకున్నారు. శరద్‌పవార్‌ను పాంటింగ్ కూడా అవమానించాడు. తొందరగా ట్రోఫీని అందజేసి వేదిక దిగిపోవాలని పాంటింగ్ శరద్‌పవార్‌తో అన్నాడు.