• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వరద సాయం వెంటనే ఇవ్వండి: వైయస్‌ వినతి

By Staff
|
న్యూఢిల్లీ: వరద బాధితుల సాయాన్ని తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రి డాక్డర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కోరారు. ఆయన బుధవారంనాడు చిదంబరంతో సమావేశమై వివిధ విషయాలు మాట్లాడారు. వరద సాయం కింద 6,600 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఆయన చిదంబరానికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లాలో 4,600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, మిగతా ప్రాంతాల్లో నష్టం 2వేల కోట్ల రూపాయల దాకా వుంటుందని ఆయన చిదంబరంతో సమావేశం ముగిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కృష్ణా డెల్టాలో డ్రైనేజీ ఆధునీకరణకు ఐదు వేల కోట్ల రూపాయలు కావాలని అడిగినట్లు, అయితే ఈ మొత్తాన్ని అంచనాలు రూపొందిస్తే ప్రపంచబ్యాంకు నుంచి అప్పు ఇప్పిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.

గోదావరి బండ్‌కు సంబంధించిన వేయి కోట్ల రూపాయలు ఇస్తామని, దానికి అవసరమైన ప్రణాళికను సమర్పించాలని చిదంబరం సూచినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఫ్యాబ్‌సిటీ గురించి మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఫ్యాబ్‌సిటీకి సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తయ్యాయని, కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడమే మిగిలి వుందని ఆయన చెప్పారు. అనంతరం రాజశేఖర రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌తో సమావేశమయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X