వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై కృషి చేస్తూనే వుంటాం: రఘువంశ్
హైదరాబాద్: తెలంగాణపై ఏకాభిప్రాయానికి కృషి చేస్తున్నామని తెలంగాణపై ఏర్పాటయిన ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) సబ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి రఘువంశ ప్రసాద్ సింగ్ చెప్పారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో పాల్గొనడానికి శుక్రవారం హైదరాబాద్ వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటు అనేది తమ చేతుల్లో లేదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకు తాము కృషి చేస్తూనే వుంటామని ఆయన చెప్పారు. చాలా పార్టీలు తమ లేఖలకు సమాధానాలు ఇచ్చాయని ఆయన చెప్పారు. కొన్ని పార్టీలు మౌనం వహిస్తున్నాయని ఆయన అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!