తెలంగాణ వెనుకబాటును రూపుమాపుతాం: వైయస్
తెలంగాణలో తాము చేపట్టిన, చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు. మిడ్ మానేరు నిర్వాసితులకు వీలైనంత ఎక్కువ నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిరిసిల్లకు 33 కోట్ల రూపాయలతో మంచినీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టామని, వేములవాడకు 9 కోట్ల రూపాయలతో మంచినీటిని అందించే పథకానికి శ్రీకారం చుట్టిన ఘనత తమదేనని ఆయన చెప్పారు. అన్ని వర్గాలవారిని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సిరిసిల్ల చేనేతకార్మికులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని ఆయన చెప్పారు. ఆప్కోను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యం చేశామని, దాన్ని బలోపేతం చేసి చేనేత కార్మికులకు మేలు చేసే విధంగా తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో కార్మిక శాఖకు తగిన మంత్రి లేడని ఆయన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును ఉద్దేశిస్తూ పరోక్షంగా అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!