వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిపిఐ నేత నారాయణకు బెయిల్‌ నిరాకరణ

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు కోర్టు సోమవారం బెయిల్‌ నిరాకరించింది. పేదల కోసం భూపోరాటానికి దిగిన నారాయణను, మరికొంత మంది సిపిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో నారాయణను శ్రీకాకుళం సబ్‌ జైలులో వుంచారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత కె. ఎర్రంనాయుడు సోమవారంనాడు నారాయణను సబ్‌ జైలుకు వెళ్లి పరామర్శించారు.

సిపిఐ నాయకులపై పెట్టిన కేసులను ప్రభుత్వం బేషరతుగా ఎత్తేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని ఎర్రంనాయుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. సిపిఐ చేస్తున్న భూపోరాటాలకు ఆయన తన మద్దతు ప్రకటించారు. చట్టాన్ని ఉల్లంఘించి వేలాది ఎకరాలను భూములను సేకరించిన రాజయ్యలాంటి వారిని వదిలేసి ప్రభుత్వం పేదల కోసం భూపోరాటం చేస్తున్నవారిని అరెస్టు చేస్తోందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X