• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోదావరిఖనిలో సింగరేణి కార్మికుడి దుర్మరణం

By Staff
|

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి గనిలో సోమవారంనాడు ఒక కార్మికుడు మరణించాడు. గని పైకప్పు కూలడంతో కోల్‌ ఫిల్లర్‌ కృష్ణమూర్తి మరణించాడు. మరో కోల్‌ ఫిల్లర్‌ రవీందర్‌ గాయపడ్డాడు. రవీందర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం సింగరేణి గనిలో పైకప్పు కూలి నలుగురు దుర్మరణం చెంది 24 గంటలు కూడా గడవకముందే గోదావరిఖనిలో అదే తరహా ప్రమాదం సంభవించడం కలవరాన్ని కలిగించింది.

కోల్‌ ఫిల్లర్‌ మరణంతో గోదావరిఖనిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యాజమాన్యం భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి లాభాల్లో నడుస్తున్నా కార్మికులకు భద్రత కల్పించే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని వారంటున్నారు. తమ ప్రాణాలు ఫణంగా పెట్టాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X