• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణను వైయస్‌ అడ్డుకుంటున్నారు: కెసిఆర్‌

By Staff
|
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నది ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరెడ్డేనని తెలంగాణ రాజశేఖర రెడ్డేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నిక పార్టీ అభ్యర్థి కె. చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కరీంనగర్‌ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి అనడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడే ప్రకటిస్తే తప్పేమిటని ఆయన అడిగారు. ప్రజలను మభ్యపెట్టి మోసగించి ఉప ఎన్నికలో గెలవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీకి తెలంగాణపై చిత్తశుద్ధి, ప్రేమ లేదని ఆయన అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలంగాణపై సేకరించి కాంగ్రెస్‌ తన వైఖరిని ప్రకటించకపోవడంలోని రహస్యం ఏమిటని, అది ప్రజలను వంచించడం కాదా అని ఆయన అడిగారు. మిగతా పార్టీలను అవమానించడం కాదా అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్‌ ప్రకటిస్తే తాను పోటీ నుంచి విరమించుకుంటానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం తెలంగాణకు అనుకూలంగానే వుందని, ప్రతిసారీ ముఖ్యమంత్రే అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తాను మంత్రిపదవికి రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం సానుకూలంగా ప్రతిస్పందించిందని, అయితే ముఖ్యమంత్రి ఢిల్లీకి రాగానే వ్యతిరేకమైందని, ముఖ్యమంత్రే తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని, ప్రజలను అయోమయంలోకి నెట్టేసి కరీంనగర్‌లో గెలవాలని వారు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ మద్యం, డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు లొంగకూడదని ఆయన కరీంనగర్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌ ఉప ఎన్నిక ఫలితం భారత రాజకీయాలనే మలుపు తిప్పుతుందని ఆయన జోస్యం చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more