• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నా ప్రాణాలకు ముప్పు: రామసుబ్బారెడ్డి

By Staff
|

హైదరాబాద్‌: తన ప్రాణాలకు అధికార పార్టీ నాయకుల నుంచి ముప్పు వుందని, తనకు రక్షణ కల్పించాలని షాద్‌నగర్‌ జంటల హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అన్నారు. బయటకు వచ్చిన తర్వాత తనను ఇరకాటంలో పెట్టేందుకు, తన ప్రాణాలకు ముప్పు కలిగించేందుకు ప్రయత్నిస్తారనేది వాస్తవమని, అయితే తాను ఎవరికీ భయపడబోనని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు నుంచి ఆయన మంగళవారం ఉదయం విడుదలయ్యారు. తెలుగుదేశం నాయకులు డాక్టర్‌ ఎం.వి. మైసురారెడ్డి, సి. రామచంద్రయ్యలతో పాటు పెద్ద యెత్తున పార్టీ కార్యకర్తలు ఆయన విడుదల కోసం నిరీక్షించారు. ఆయన విడుదల కాగానే కార్యకర్తలు, అభిమానులు బాజాభజంత్రీలతో స్వాగతం చెప్పారు.

తనను తప్పుడు కేసులో ఇరికించారని, చేయని నేరానికి తాను రెండేళ్లు శిక్ష అనుభవించానని ఆయన అన్నారు. తనకు తన జిల్లా ప్రజలు మానసిక ధైర్యాన్ని ఇచ్చారని, ఈ ధైర్యం ముందు అధికార పార్టీ ఒత్తిళ్లు ఏ మాత్రం పని చేయవని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం ముందు అధికార పార్టీ ఒత్తిళ్లు పని చేయలేదని ఆయన అన్నారు. రామసుబ్బారెడ్డితో పాటు మిగతా ఏడుగురు కూడా చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. షాద్‌నగర్‌ జంట హత్యల కేసులో ఈ ఎనిమిది మందిని హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసిన విషయం తెలిసిందే.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more