వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిసికి ఇస్తే మంచిదే, కాని ఎవరిస్తారు?: విహెచ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి పదవి వెనకబడినతరగతుల (బిసి) నాయకుడికి ఇస్తే మంచిదేనని, అయితే ఎవరిస్తారని కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు వి. హన్మంతరావు అన్నారు. ముఖ్యమంత్రి పదవి బిసిలకు వస్తుందనే క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణరావు ప్రకటనకు స్పందిస్తూ ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద ఆ విధంగా అన్నారు. సత్యనారాయణరావు కొత్త పంచాయతీ పెడుతున్నారని, దీనివల్ల పార్టీలో అయోమయం నెలకొంటుందని ఆయన అన్నారు.

వైయస్‌ రాజశేఖర రెడ్డే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా వుంటారని, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి తన పేరుపై ఊహాగానాలు చెలరేగుతూనే వున్నాయని, అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని తనకు ఆసక్తి లేదని ఆయన అన్నారు. సత్యనారాయణరావు అనవసరమైన అయోమయం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. బిసిలను ముఖ్యమంత్రిని చేయదలుచుకుంటే ఎవరిని చేస్తారు, రఘువీరా రెడ్డినా? అని హన్మంతరావు అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X