వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హాలివుడ్‌ నటి అంజెలినీ జోలీ బాడీగార్డుల అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: హాలీవుడ్‌ సినీనటి అంజెలినా జోలీ బాడీగార్డులను ముగ్గురని ముంబాయి పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ముంబాయిలోని ఒక పాఠశాలలో ఆమె నటిస్తున్న ఎ మైటీ హార్ట్‌ సినిమా షూటింగ్‌ సందర్భంగా దౌర్జన్యానికి దిగినందుకు గాను పోలీసులు వారిని అరెస్టు చేశారు. సినిమా షూటింగ్‌ కోసం గురువారం మధ్యాహ్నం అంజుమన్‌ - ఎ - ఇస్లామ్‌ పాఠశాలకు చేరుకోవడంతో సమస్య మొదలైంది. అది పాఠశాల తరగుతులు అయిపోయే సమయానికి చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ అరెస్టులను జోన్‌ -1 డిప్యూటీ పోలీసు కమీషనర్‌ బ్రజేష్‌ సింగ్‌ ధృవీకరించారు. అయితే వారిపై మోపిన అభియోగాలను వెల్లడించడానికి నిరాకరించారు.

పాఠశాల ఆవరణలో అంజెలినా జోలి సినిమా షూటింగ్‌ను చూడడానికి మొదట విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి ప్రదర్శించారు. ఆ తర్వాత గగ్గోలుకు దారి తీసింది. అంజెలినా జోలీ బాడీగార్డులు తమను అసభ్యంగా దూషించారని, జాతి పేరుతో కూడా వారు దూషించారని తల్లిదండ్రులు అంటున్నారు. ఆ పాఠశాలను పాకిస్తానీ పోలీసు స్టేషన్‌గా సినిమాలో చూపించేందుకు ఏర్పాట్లు చేసుకుని షూటింగ్‌ ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X