వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మధు లొంగలేదు, అరెస్టు చేశాం: స్వరణ్జిత్ సేన్
వరంగల్: రాకెట్ లాంచర్ల కేసులో నిందితుడు టెక్ మధు లొంగిపోలేదని, మధును పోలీసులు అరెస్టు చేశారని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్ స్పష్టం చేశారు. లొంగుబాటుకు, అరెస్టుకు మధ్య చాలా తేడా వుందని, పోలీసులు మధును అరెస్టు చేశారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
నక్సలిజం, మావోయిజం ఆంధ్రప్రదేశ్లో కాలం చెల్లిన సిద్ధాంతాలని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మావోయిస్టు సిద్ధాంతం మారిపోయిందని ఆయన అన్నారు. టెక్ మధుపై వరంగల్ జిల్లాలో ఏ విధమైన కేసులు లేవని జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (యస్పీ) సౌమ్య మిశ్రా వరంగల్లో మీడియా ప్రతినిధులతో చెప్పారు. మహబూబ్నగర్ జిల్లాలో మధుపై కేసులున్నాయని, అందువల్ల మధును మహబూబ్నగర్ జిల్లా పోలీసులకు అప్పగిస్తామని ఆమె చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!