వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియాతో తెరాస విలీనంపై మాట్లాడలేదు: కెకె
న్యూఢిల్లీ: తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో తాను కాంగ్రెస్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం గురించి మాట్లాడలేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. ఆయన బుధవారంనాడు సోనియా గాంధీతో సమావేశమై తెలంగాణపై చర్చించారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా వున్నారని వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. అవసరమైనప్పుడు తాను కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతీయ సమన్వయ కమిటీ (టి ఆర్సిసిసి) నాయకులతో సోనియా గాంధీని కలుస్తానని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!