వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రంగారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా: ఐదుగురు మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం శ్రీమంతగూడెం గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఆదివారంనాడు ఐదుగురు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఇబ్రాహింపట్నం ఆస్పత్రికి తరిలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు అందరూ కూలీలే.
సిమెంటు లోడుతో వెళ్తున్న ట్రాక్టరులో 15 మంది ప్రయాణిస్తున్నారు. అది అదుపు తప్పి బోల్తా పడింది. ఓవరు లోడే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!