వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి రాజకీయం కలిసిరాదు: రోజా

By Staff
|
Google Oneindia TeluguNews


అనంతపురం: రాజకీయాల్లోకి వస్తే మెగాస్టార్ చిరంజీవికి కలిసి రాదని తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలు, సినీ నటి రోజా అన్నారు. రాజకీయాల్లోకి వస్తే చిరంజీవికి కలిసొచ్చే పరిస్థితులు లేవని ఆమె ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. రాజకీయాల్లోకి రావాలా, వద్దా అనేది చిరంజీవి వ్యక్తిగత విషయమని, దానిపై మాట్లాడటం సబబు కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడున్న పరిస్థితులు భిన్నమైనవని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉందని, కాంగ్రెస్ నాయకుల కాళ్ల కింద ప్రజలు నలిగిపోతున్నారని, ఆ స్థితిలో ప్రజలు ఎన్టీఆర్ ను ఆదరించారని ఆమె వివరించారు. అంతేకాకుండా రాముడిగా, కృష్ణుడిగా ప్రజలు ఎన్టీఆర్ ను సినిమాల్లో చూసిన ప్రజలు ఆయనను ఆదరించారని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ మాదిరిగా ఎవరూ తిరగలేరని కూడా ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X