• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సమాల్ వన్నీ గాలివాటం ఆరోపణలే: వైయస్

By Staff
|

హైదరాబాద్: విజిలెన్స్ మాజీ కమీషనర్ సమాల్ పరిణతి చెందిన ఐఎఎస్ అధికారి చేయతగని వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. సమాల్ గాలివాటం వ్యాఖ్యలు చేశారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రతి రంగానికి చెందిన అందరినీ ఒకే గాటన కట్టేసి నిరాధారమైన ఆరోపణలు చేశారని, ప్రతి రంగంలోనూ అవినీతిపరులుంటారని, అయితే అందరినీ ఒకే గాటన కట్టేయడం తగదని ఆయన అన్నారు. ఇంత మంది అవినీతిపరులుంటే తనతో ఒక మాటైనా చెప్పలేదని ఆయన అన్నారు. హోంమంత్రి కె. జానారెడ్డిపై అడ్డూ అదుపులేని వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. తనకు కాన్ఫిడెన్షియల్ నివేదిక ఎందుకు పంపలేదని, క్రమం తప్పకుండా పంపాల్సిన వార్షిక నివేదికలు ఎందుకు పంపలేదని ఆయన అన్నారు. ఏమైనా సమాల్ నివేదికపై అధ్యయన కమిటీ వేస్తున్నామని, ఈ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎసిని విభాగం అధిపతి, విజిలెన్స్ డిజీని వేస్తున్నామని ఆయన చెప్పారు. సమాల్ తన పరిధిని మించి వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. రెండు సార్లు రిటైర్మెంట్ తీసున్న అధికారికి ఇటువంటి వ్యాఖ్యలు తగవని ఆయన అన్నారు. అవినీతి అధికారులను, రాజకీయ నాయకులను ప్రభుత్వం వదిలిపెట్టదని ఆయన చెప్పారు. హోంమంత్రి జానారెడ్డి పెద్ద మనిషి అని, జానారెడ్డిని తప్పు పట్టడం సరి కాదని ఆయన అన్నారు.

ఎద్దు ఈనిందంటే గాటన కట్టేయాలని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న అవకాశం వచ్చినా తామంటే పడని రాజకీయవాదులు తమపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇంతకు ముందటి ప్రభుత్వాలు చేయని విధంగా తమపై వచ్చిన ప్రధాన ఆరోపణలపై విచారణకు సిబిఐ విచారణకు, న్యాయ విచారణలకు ఆదేశించామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయాధికారులను తప్పు పట్టే అధికారం సమాల్ కు ఎవరిచ్చారని ఆయన అడిగారు. రిటైర్ అయ్యాక కార్యాలయానికి వెళ్లి నివేదిక తీసుకుని మీడియాకు వెల్లడించడం తగునా ఆయన అడిగారు. తన కార్యాలయానికి చెందిన అధికారులపై ఆరోపణలు చేసే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. తాము ఐఎఎస్ 13 మందిపై చర్యలు తీసుకున్నామని, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 4గురిపైనే చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు. ఐపియస్ అధికారిని అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రథమమని ఆయన చెబుతూ విశాఖపట్నం రూరల్ ఎస్పీ మురళిపై చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాల్ పుస్తకం రాయడానికి కర్టైన్ రైజరుగా ఈ ఆరోపణలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.

గల్ఫ్ నుంచి వచ్చే ప్రవాస భారతీయులకు ఉపాధి కల్సించడానికి చర్యలు తీసుకుంటామని, వారికి రెండు నెలల శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. అందుకు భవన నిర్మాణ కంపెనీల యజమానులను పిలిపిస్తున్నామని ఆయన చెప్పారు. వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న రుణాల వసూలును ఏడాది పాటు నిలిపేస్తూ మారిటోరియం ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంచడానికి పశుక్రాంతి, జీవక్రాంతి పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more