వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన మంత్రి గల్లా అరుణకుమారి

By Staff
|
Google Oneindia TeluguNews


హైదరాబాద్: ఉస్మానియా దంత వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళనకు వైద్య విద్యా శాఖ మంత్రి గల్లా అరుణ దిగివచ్చారు. విద్యార్థులు నిరశన చేపట్టిన చోటికి ఆమె వచ్చారు. తమ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ కమలాదేని తొలగించాలంటూ డెంటల్ కళాశాల విద్యార్థులు 20 మంది ఒక గదిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వారిని ఆస్పత్రిలో చేర్పించారు.

ఈ స్థితిలో డెంటల్ కళాశాల విద్యార్థులు గల్లా అరుణకుమారి దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సాయంత్రంలోగా తమ డిమాండును నెరవేర్చకపోతే ఆత్మహత్యలు కూడా చేసుకుంటామని విద్యార్థులు హెచ్చరించారు. ఈ స్థితిలో అరుణకుమారి అక్కడికి చేరుకున్నారు. ప్రిన్సిపాల్ ను దీర్షకాలిక సెలవుపై పంపిస్తామని అరుణకుమారి విద్యార్థుల ముందు ఒక ప్రతిపాదన పెట్టారు. దానికి విద్యార్థులు అంగీకరించలేదు. ప్రిన్సిపాల్ ను తొలగించాల్సిందేనని పట్టుబట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X