వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ "ఫోర్స్"పై నారాయణ భాషణ

By Staff
|
Google Oneindia TeluguNews


న్యూఢిల్లీ: చిరంజీవి తమ్ముడు, సినిమా హీరో పవన్ కళ్యాణ్ స్ధాపించదలచుకున్న "కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్" ఆలోచనను విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు. దీనివల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదముందని ఆయన అన్నారు. ఈ "ఫోర్స్" కాలక్రమంలో ప్రైవేటు సైన్యంగా మారితే అదుపు తప్పే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు.

పవన్ కళ్యాణ్ తన " కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్" ఆలోచనను బయటపెట్టడం, దానికి తన వంతుగా కోటి రూపాయల విరాళం ప్రకటించడం పై చిరు, పవన్ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతున్నా, నారాయణ వంటి సీనియర్ నాయకులకు సందేహాలు ఉన్నాయి. శ్రీజ ప్రేమ పెళ్ళి వివాద నేపధ్యంలో ఈ ఫోర్స్ గురించి పవన్ ప్రకటించడం సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్ళవచ్చని, మంచి టైమ్ లో పవన్ ఈ సమాజ ఉద్ధరణ కార్యక్రమన్ని చేపట్టి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయం కావచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X