• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

610 జీఓ అమలుపై సీఎం సమీక్ష

By Staff
|

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: 610 జీఓ అమలుపై ఏర్పడిన ఉప సంఘంతో ఈరోజు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సమీక్షా సమావేశం జరిపారు. వారి పరిశీలనలు గురించి తెలుసుకున్నారు. తెలంగాణా జిల్లాలనుంచి 4957 మంది ఉద్యోగులను కోస్తా జిల్లాలకు అక్కడినుంచి 833 మందిని తెలంగాణా జిల్లాలకు తరలిస్తే సరిపోతుందని కమిటీ తేల్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ శాఖల్లో 4,900 సూపర్‌ న్యూమరీ పోస్టులు సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 610 జీఓ అమలుపై రెండేళ్లక్రితం ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. వారు 4 4 లక్షల 8వేల 764 నియామకాలను పరిశీలించారు. ఇందులో 64 వేలమంది రికార్డులు లభించలేదు. మిగిలిన 3 లక్షల 41వేలమంది ఉద్యోగుల రికార్డులను కమిటీ అధ్యయనం చేసింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 18,783 ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. ఈ అధ్యయన నివేదికను వివిధ ఉద్యోగసంఘాలకు, అసెంబ్లీ కమిటీకి అందజేస్తామని హోంమంత్రి, క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఛైర్మన్‌ జానారెడ్డి తెలిపారు. వారి నివేదిక ఆధారంగా ఖాళీ అయ్యే ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ శాఖల అధికారులను సీఎం ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X