వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో యువతి అనుమానాస్పద మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నారై కుర్రాడిని పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళిన ఓ యువతి జీవితం అర్ధంతరంగా ముగిసింది. పెళ్లయి రెండేళ్లు కూడా నిండని ఆమె శుక్రవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. వివరాలు చెప్పాల్సిన భర్త మొహం చాటేశా డు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని నార్త్‌రిడ్జ్‌లో ఉంటున్న వేముల సుష్మ(25) మృత్యుగాథ ఇది.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం నార్త్‌రిడ్జ్‌ ప్రాంతంలో నివసిస్తున్న వేముల సుష్మ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సుష్మ చనిపోయిందంటూ శుక్రవారం ఉదయం అందిన వార్త హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆమె తల్లిదండ్రులను నిర్ఘాంతపర్చింది. మరణానికి కారణం వెంటనే తెలియకపోయినా... తమ బిడ్డను అల్లుడు సురేష్‌ పొట్టనబెట్టుకున్నాడని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. నార్త్‌రిడ్జ్‌ ప్రాంతంలోనే ఉంటున్న సుష్మ మేనమామ కూతురు హారిక శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని సుష్మ తండ్రి కనకరాజంకు ఫోన్‌ చేసి ఆమె మరణ వార్తను తెలిపారు.

విషయం తెలిసి తాను వెళ్లేసరికే నార్త్‌రిడ్జ్‌ పోలీసులు సుష్మ మృతదేహాన్ని తీసుకెళుతున్నారని, దాంతో ఆమె ఎలా మరణించిందన్నది తనకు తెలియరాలేదని చెప్పారు. ఈ విషయం తెలియగానే కనకరాజం కుటుంబం దుఖఃసాగరంలో మునిగిపోయింది. చదువుకున్నవాడికిచ్చి పెళ్లి చేస్తే భవిష్యత్తు బావుంటుందని సురేష్‌కిచ్చి పెళ్లి చేశామని, వివాహమైన రెండేళ్లలోపే ఇలా చనిపోతుందని కలలో కూడా ఊహించలేదని ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లు పెడుతుంటే ఓదార్చటం ఎవ్వరివల్లా కాలేదు.

భర్తపైనే అనుమానాలు
భర్త సురేష్‌ తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. తండ్రి కనకరాజం 'ఆన్‌లైన్‌'తో మాట్లాడుతూ తన కూతురిని సురేష్‌ హత్య చేసి ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం హారిక ఫోన్‌ చేసి సుష్మ చనిపోయిందని చెప్పగానే తాను సురేష్‌కు ఫోన్‌ చేశానన్నారు. హలో అన్న సురేష్‌ ఆ వెంటనే ఫోన్‌ కట్‌ చేసేశాడని చెప్పారు. ఆ తరువాత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోన్‌ రిసీవ్‌ చేసుకోలేదన్నారు.

సురేష్‌ తల్లిదండ్రులతో మాట్లాడగా తమకు కూడా అందుబాటులోకి రాలేదని చెప్పారన్నారు. సుష్మ దగ్గరి బంధువులు మాట్లాడుతూ సురేష్‌ సైకోలాగా ప్రవర్తించేవాడన్నారు. చిన్న చిన్న విషయాలపై కూడా సుష్మతో గొడవలు పడేవాడని చెప్పారు ఫోన్‌కాల్‌ వచ్చినా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అంటూ గొడవ పడేవాడని చెప్పారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామ వాస్తవ్యులైన భాగ్య, కనకరాజంలు భార్యాభర్తలు. ఎపి ట్రాన్స్‌కోలో డివిజనల్‌ ఇంజనీరుగా పనిచేసి పదవీ విరమణ పొందిన కనకరాజం ప్రస్తుతం హిమాయత్‌నగర్‌ 7వ నెంబరు వీధిలోని కృష్ణధామం అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు.

సుష్మ (22), వంశీ వారి సంతానం. 2007, ఏప్రిల్‌ 6న ఆమె వివాహం కరీంనగర్‌ జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాల్వశ్రీరాంపూర్‌ గ్రామానికి చెందిన గోలి సురేష్‌తో జరిగింది. పెళ్లినాటికి సురేష్‌ కూడా ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. 2007, డిసెంబరులో ఉద్యోగం రావటంతో సురేష్‌ భార్య సుష్మను వెంటబెట్టుకుని అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌లో ఉన్న నార్త్‌రిడ్జ్‌ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సుష్మ సోదరుడు వంశీ అమెరికా వెళ్లాల్సి ఉంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న వంశీ ఈనెల 23వ తేదీన వెళ్లటానికి విమానం టిక్కెట్లు కూడా రిజర్వ్‌ చేయించుకున్నాడు. అంతలోనే తన సోదరి చనిపోయిన విషయం తెలిసి వంశీ కుప్పకూలిపోయాడు. సుష్మ మరణంతో ఆమె తండ్రి స్వగ్రామమైన కరీంనగర్‌ జిల్లా పచ్చునూరులో కూడా విషాదఛాయలు అలముకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X