• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'తెలంగాణ బిచ్చగాడి చేతిలో భగవద్గీత'

By Staff
|

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఏర్పాటు చేస్తే బిచ్చగాడి చేతిలో భగవద్గీత పెట్టినట్లు అవుతుందని మార్కెటింగ్‌ శాఖ మంత్రి మారెప్ప తెలిపారు. వివాదాస్పద ప్రకటనలకు మారుపేరుగా మారిన ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశలో ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. సీపీఐ నేత నారాయణ, తెదేపా అధినేత చంద్రబాబు, పీఆర్పీ నేత చిరంజీవిని తనదైన శైలిలో విమర్శించారు. సిద్ధాంతాలు, విధానాలపై కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కోరుతున్న తమ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఆస్తులను జప్తు చేయాలని, ఆ ఆస్తుల డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టాలని ఆయన అన్నారు. అడిగినట్లు అడిగినట్లు రాష్ట్రం ఇస్తే బిచ్చగాడి చేతిలో భగవద్గీత పెట్టడమే అవుతుందని ఆయన అన్నారు. పిఆర్పీ అంటే పాలసీ రీజనింగ్ లేని పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X