• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిఘా వ్యవస్థ ఆధునీకరణ: ప్రధాని

By Staff
|

న్యూఢిల్లీ : ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్రాల్లో ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఆధునికీకరించాలని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. వివిధ రాష్ట్రాల డీజీ, ఐజీల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖాకీలపై ప్రజలకు నమ్మకం సడలుతోందని తెలిపారు. పోలీసులంటే ప్రజలకు నమ్మకం కలిగేలా మెలగాలని కోరారు. పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు. శాఖలోని కొన్ని విభాగాల మధ్య సమన్వయం మరింత పెరగాలని సూచించారు. మతోన్మాదం అనే వైరస్‌ దేశ లౌకికత్వాన్ని దెబ్బతీసే ప్రమాదముందని పోలీసులు ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తీవ్రవాద, ఉగ్రవాద చర్యలు, అక్రమ చొరబాట్లు వంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ప్రధాని పేర్కొన్నారు. దీని కోసం ఓ ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ఆయన వెల్లడించారు. తీవ్రవాద దుశ్చర్యలను అంతమొందించేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం సిద్ధం కావాలని ప్రధాని పిలుపు నిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X