వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొయిలీ మాటలు అసత్యం: వినోద్

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలను వరంగల్ ఎంపీ వినోద్ కుమార్ తప్పుపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఏకాభిప్రాయం కుదరలేదని వీరప్ప మొయిలీ అన్న మాటలు వాస్తవాలు కావని వినోద్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేనట్లైతే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా లభించవని వినోద్ జోస్యం చెప్పారు.

ఇప్పటికే తెలంగాణపై ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా, పీఆర్‌పీ, సీపీఎం, బిజెపి స్పష్టమైన వైఖరిని ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా వినోద్ గుర్తు చేశారు. ఏకాభిప్రాయం అంటే లగడపాటి, దివాకర్ రెడ్డి వ్యాఖ్యలా అని ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X