• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తాజ్‌ పూర్తి విముక్తి

By Staff
|

ముంబై: జాతీయ భద్రతాదళాలు మొత్తానికి తాజ్‌ హోటల్‌ను కూడా విముక్తి చేశారు. శనివారం ఉదయం 8-15 గంటల ప్రాంతాల్లో తాజ్‌ హోటల్‌ లోపల నక్కిన టెర్రరిస్టును మట్టు పెట్టారు. తాజ్‌లో ఒక టెర్రరిస్టే ఉన్నాడని భావించినా వివిధ సమయాలలో తాజ్‌ లోపల వివిధ అంతస్థులలో అలికిడి కనిపించడంతో భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించి టెర్రరిస్టులను మట్టికరిపించారు. ఆ తర్వాత భద్రతా సిబ్బంది అన్ని అంతస్థులను సోధించగా ముగ్గురు టెర్రరిస్టుల మృత దేహాలు అక్కడక్కడ పడివున్నాయి. 'సైక్లోన్‌' ఆపరేషన్‌గా భద్రతా సిబ్బంది సాగించిన ఈ పోరులో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు కూడా దొరికాయి. ముంబాయి నగరంపై టెర్రరిస్టులు సాగించిన కుట్రలో మొత్తం 40 మంది పాల్గొన్నట్లు అంచనా. ఒక టెర్రరిస్టు మాత్రం భద్రతా సిబ్బందికి దొరకగా అతన్ని ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ టెర్రరిస్టు చెప్పిన అంశాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. తాము పాకిస్తాన్‌లో సైన్యం వద్ద శిక్షణ పొంది జల మార్గం గుండా ముంబాయిలో ప్రవేశించామని, అమెరికాలో లాగానే ఇక్కడ కూడా 9/11 పునరావృతం చేయాలనుకున్నామని విచారణలో తెలియజేశాడు. భారత్‌ దేశ ఆర్థిక పటిష్ఠతకు సంకేతమైన ముంబాయి మహా నగర్‌లో అతి కీలకమైన కట్టడాన్ని నేల మట్టం చేయదలచామని, అందుకు తాజ్‌, ఒబేరాయ్‌ హోటళ్ళు చక్కటి సంకేతాలుగా భావించి వాటినే భష్మీపటలం చేయడానికి ఎంచుకున్నామని ఆ టెర్రరిస్టు వెల్లడించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X