• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముగ్గురు తీవ్రవాదులు హతం, ఆపరేషన్ ముమ్మరం

By Staff
|

ముంబయి: తాజ్‌ హోటల్‌లో ఆపరేషన్‌ పూర్తిగా ముగిసినట్లు కాదని హోటల్‌ మొత్తం గాలించి అన్ని విషయాలు ధృవీకరించుకున్నాకే ఇది ముగిసినట్లు భావించాలని ఎన్‌ఎస్‌జీ చీఫ్‌ దత్‌ తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.ఇప్పటివరకు చేసిన దాడుల గురించి తెలిపారు. తాజ్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని, కొన్ని గ్రెనేడ్లు, ఏకే 47లు కూడా తమకు దొరికాయని ఆయన చెప్పారు. తమ కమాండర్‌ ఒకరు వారితో పోరాడుతూ వీరమరణం పొందారని చెప్పారు. ఇంకా తనిఖీ కొనసాగుతోందన్నారు. తీవ్రవాదులు బలహీనపడగానే బెదిరించేందుకు మొదట చేసే పని మంటలు పెట్టటం అని వారి ఈ అలవాటే వారి బలాబలాలను తెలియజేసిందని అన్నారు. హోటల్‌లో ఇంకా కొందరు అతిథులు ఉండే అవకాశం ఉందని వారిని బయటకు తేవటం పెద్ద సమస్య అని ఆయన అన్నారు. తలుపు కొడితే తీవ్రవాదులు వచ్చారనే వారు భయపడతారని అన్నారు. అందుకే కిటికీల పరదా తొలగించి సంకేతం పంపమని కోరామన్నారు. తద్వారా తాము చూసి ధృవీకరించుకుని కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం తనిఖీలు పూర్తయ్యాక తాము మళ్లీ మీడియాకు చెబుతామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X